రివ్యూ: గల్లీ బాయ్

రివ్యూ: గల్లీ బాయ్

నటీనటులు: రణ్‌వీర్‌ సింగ్‌, ఆలియా భట్‌, కల్కీ కొచ్లిన్‌, విజయ్‌ రాజ్‌, విజయ్‌ వర్మ తదితరులు

సంగీతం: శంకర్- ఎహసాన్- లాయ్ 

సినిమాటోగ్రఫీ: జే ఓజా

నిర్మాణ సంస్థ: ఎక్సెల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, టైగర్‌ బేబీ ప్రొడక్షన్స్‌

స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జోయా అక్తర్‌

పద్మావతి, సింబా సినిమాలతో వరస హిట్స్ సాధించిన రణ్వీర్ సింగ్ ఇప్పుడు గల్లీ బాయ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.  అలియా భట్ తో తనకు ఇది మొదటి సినిమా.  ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన గల్లీ బాయ్ ఈరోజు రిలీజ్ అయ్యింది.  మరి ఇది ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం. 

కథ : 

రణ్వీర్ సింగ్ ఓ మిడిల్ క్లాస్ కుటుంబానికి చెందిన యువకుడు.  కొడుకు బాగా చదువుకొని జీవితంలో స్థిరపడాలని రణ్వీర్ సింగ్ తండ్రి విజయ్ రాజ్ కలలు కంటాడు.  తానొకటి తలిస్తే.. దేవుడు మరొకటి తలుస్తాడు అన్నట్టు.. రణ్వీర్ కు ర్యాంప్ సంగీతం అంటే ఇష్టం. ర్యాప్  బాండ్ తో కలిసి తన టాలెంట్ ను నిరూపించుకోవాలని అనుకుంటాడు.  మిడిల్ క్లాస్ వ్యక్తి కావడంతో అతనికి ఎవరు అవకాశం ఇవ్వరు.  ఈ సమయంలోనే రణ్వీర్ కు అలియా భట్ పరిచయం అవుతుంది.  ఆ పరిచయం ప్రేమగా మారుతుంది.  రణ్వీర్ టాలెంట్ ను గుర్తించిన అలియా.. అతనికి అండగా నిలుస్తుంది.  ఆ తరువాత ఏం జరిగింది అన్నది మిగతా కథ.  

విశ్లేషణ: 

సంగీతం బ్యాంగ్ గ్రౌండ్ తో సినిమాలు వచ్చాయిగాని, ర్యాప్  మ్యూజిక్ బ్యాగ్ గ్రౌండ్ తో సినిమాలు రాలేదు.  బహుశా బాలీవుడ్ లో ఇదే మొదటి సినిమా.  ఇందులో రణ్వీర్, అలియాలు నటిస్తున్నారని సరికి అంచనాలు పెరిగాయి.  జోయా అక్తర్ టాలెంటెడ్ డైరెక్టర్.  ఆమె గురించి చెప్పాల్సిన అవసరం లేదు.  దీంతో సినిమాకు మంచి హైప్ క్రియేట్ అయ్యింది.  కథ కంటే ఈ సినిమా ర్యాంప్ మ్యూజిక్ పైనే ఎక్కువ దృష్టి పెట్టడంతో కథ పెద్దగా కనిపించదు.  అలియా, రణవీర్ లు చాలా సహజంగా కనిపించారు.  సినిమా ఓపెనింగ్ నుంచి ఎండింగ్ వరకు ర్యాంప్ మ్యూజిక్ ను నడిపిన తీరు బాగుంది.  

నటీనటుల పనితీరు: 

రణ్వీర్ పాత్ర ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ.  మురాద్ అనే పాత్రలో రణ్వీర్ ఒదిగిపోయి కనిపించాడు.  సఫీనా పాత్రలో అలియా అద్భుతంగా నటించింది.  ఇందులో అలియా చేసే అల్లరి అందరికి తప్పకుండా నచ్చుతుంది.  తన బాయ్ ఫ్రెండ్ ను ఎవరైనా ఏడిపిస్తే వారికి వార్నింగ్ లు ఇచ్చే సీన్స్ ఆకట్టుకుంటాయి.  ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది.  

సాంకేతిక వర్గం పనితీరు: 

జోయా అక్తర్ కథ కంటే ర్యాప్  మ్యూజిక్ చుట్టూనే కథను నడిపేందుకు ఎక్కువ ఆసక్తి చూపించింది.  ఇలాంటి సినిమాల్లో బలమైన కథ ఉంటె సినిమా ఎక్కడికో వెళ్తుంది.  కథపై శ్రద్ధపెట్టి ఉంటె బాగుండేది.  సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణ.  అప్నా టైం ఆయేగా సాంగ్ బాగుంది.  నిర్మాణ విలువలు బాగున్నాయి.  

పాజిటివ్ పాయింట్స్: 

రణ్వీర్, అలియా నటన 

నిర్మాణ విలువలు 

సంగీతం 

నెగెటివ్ పాయింట్స్: 

కథ 

కథనాలు 

చివరిగా : ఈ గల్లీ బాయ్ పర్వాలేదనిపించాడు.