కేవీపీ పాత్రలో ప్రముఖ నటుడు

కేవీపీ పాత్రలో ప్రముఖ నటుడు

దిగవంతనేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా "యాత్ర" పేరుతో ఓ బయోపిక్ రూపొందనున్న సంగతి తెలిసిందే. మహి వి రాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం ప్రస్తుతం నటీనటులు ఎంపికలో బిజీగా ఉంది. రాజశేఖర్ రెడ్డి జీవితంలో కేవీపీ రామచంద్ర రావు చాలా ముఖ్య భూమికను పోషించారు. ఇక సినిమాలో ఈ పాత్రలో నటించడానికి ప్రముఖ నటుడు రావు రమేష్ ని ఎంపిక చేశారని సమాచారం. 

ఈ సంగతిపై డైరెక్టర్ మహి వి రాఘవ్ మాట్లాడుతూ కేవీపీ పాత్రలో రావు రమేష్ ని తీసుకున్నాం అని తెలిపారు. అలాగే వైఎస్ భార్య విజయమ్మ పాత్ర కోసం నటీమణులను చూస్తున్నామని, త్వరలోనే ఎవరు నటిస్తారో అధికారికంగా తెలుపుతాము. ఇక జగన్ మోహన్ రెడ్డి పాత్రలో నటించడానికి తమిళ నటుడు సూర్యని కలిశామని..ఆయన నుండి ఇంకా ఎలాంటి రెస్పాన్స్ రాలేదని..దానికోసమే ఎదురుచూస్తున్నాం అని రాఘవ్ తెలిపారు. ఈ చిత్రం రాజకీయ కోణాల నడుమ ఉండనుండడంతో చాలా మంది నటులు నటించడానికి ముందుకు రావడం లేదని సన్నిహిత వర్గాల సమాచారం. ఈ చిత్రం ప్రధానంగా రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర మొదలెట్టడానికి ముందు జరిగిన పరిస్థితుల ఆధారంగా ఉండనుంది. వైఎస్ పాత్రలో మమ్ముట్టి నటించనున్న సంగతి తెలిసిందే. జూన్ 15 నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.