యాత్ర బయోపిక్ లో రావు రమేష్ పాత్ర ఇదేనా..!!

యాత్ర బయోపిక్ లో రావు రమేష్ పాత్ర ఇదేనా..!!

యాత్ర సినిమా షూటింగ్ చాలా వరకు కంప్లీట్ అయింది.  పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ కూడా స్టార్ట్ కాబోతున్నాయి.  ఈ సినిమాలో ప్రధాన పాత్రధారి మమ్మూట్టి తో సహా చాలామంది నటీనటులు ఇందులో నటించారు.  ఎవరెవరు ఎలాంటి పాత్రలు చేశారనే విషయాన్ని బయోపిక్ ఒక్కొక్కటిగా రివీల్ చేస్తున్నది.  

వైఎస్ రాజారెడ్డి పాత్రను టాలీవుడ్ నటుడు, ప్రస్తుతం హాట్ విలన్ జగపతి బాబు పోషిస్తున్నారు.  ఆ పాత్రకు సంబంధించిన ఫోటోను నిన్న యూనిట్ రిలీజ్ చేసింది.  ఇప్పుడు ఈ సినిమా గురించిన మరో న్యూస్ బయటకు వచ్చింది.  క్యారెక్టర్ ఆర్టిస్ట్ రావు రమేష్ ఇందులో కేవీపీ పాత్రను పోషిస్తున్నారని తెలుస్తోంది.  ఫిబ్రవరి 8 వ తేదీన ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నారు.