రాపాక అరెస్ట్ లో కొత్త ట్విస్ట్...బెయిల్ పై విడుదల !

రాపాక అరెస్ట్ లో కొత్త ట్విస్ట్...బెయిల్ పై విడుదల !

తూర్పుగోదావరి జిల్లా మలికిపురం పోలీస్ స్టేషన్ ముట్టడి కేసులో ఏ1గా నమోదు చేయబడ్డ జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రాజోలు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాపాకకు కస్టడీ విధించే నిమిత్తం రాజోలు మున్సిఫ్ మేజిస్ట్రేట్ ముందు ఆయన్ని పోలీసులు హాజరుపరిచారు. అయితే రాపాక ఎమ్మెల్యే అయినందున ఆయనకు కస్టడీ విధించేందుకు మేజిస్ట్రేట్ నిరాకరించారు. ఓ ఎమ్మెల్యేను అరెస్టు చేసే విధానం ఇది కాదని పోలీసులకి ఆయన సూచించారు. ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసుల విషయంలో విజయవాడలోని ప్రత్యేక కోర్టుకు వెళ్లాలని పోలీసులకు సూచించారు. అంతే కాకుండా రాపాకకు స్టేషన్‌ బెయిల్‌ మంజూరు చేయాలని ఆదేశించడంతో పోలీసులు ఆయనకు స్టేషన్‌ బెయిల్‌ మంజూరు చేసి విడుదల చేశారు పోలీసులు.