నిజాంపేటలో మరో దారుణం: సాఫ్ట్ వేర్ ఉద్యోగినిపై అత్యాచారం

నిజాంపేటలో మరో దారుణం: సాఫ్ట్ వేర్ ఉద్యోగినిపై అత్యాచారం

తెలంగాణలో మానస, ప్రియాంక రెడ్డి అత్యాచారం, హత్య ఘటనలు మరవక ముందే మరో దారుణం జరిగింది. సాఫ్ట్ వేర్ ఉద్యోగినిపై అత్యాచారం జరిగింది.  ఈ ఘటన హైదరాబాద్ లోని నిజాంపేటలో జరిగింది.  సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్న ఓ యువతి తన సోదరితో కలిసి నిజాంపేటలోని ఈశ్వరి విలాస్ రోడ్ లో ఓ అపార్ట్మెంట్ లో అద్దెకు ఉంటుంది.  సోదరి బయటకు వెళ్లడంతో ఒంటరిగా ఉన్నది.  సాఫ్ట్ వేర్ ఉద్యోగిని స్నేహితుడు జాయ్ చంద్ ఆమె ఇంటికి వచ్చి ఒంటరిగా ఉన్న స్నేహితురాలిపై కిరాతకంగా అత్యాచారం చేశారు.  దీంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళింది.  

ఇంటికి వచ్చిన సోదరి జరిగిన విషయం చూసి షాక్ అయ్యింది.  వెంటనే పోలీసులకు కంప్లైంట్ చేసింది. పోలీసులు హుటాహుటిన వచ్చి యువతిని గాంధీ హాస్పిటల్ కు తీసుకెళ్లారు.  వైద్య పరీక్షలు చేయిస్తున్నారు.  నిందితుడు జాయ్ చంద్ పరారీలో ఉన్నాడు.  నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.