కాకినాడలో ఘోరం...4 ఏళ్ల బాలికపై రేప్

కాకినాడలో ఘోరం...4 ఏళ్ల బాలికపై రేప్

దిశ లాంటి కఠిన చట్టాలు ఎన్ని తెచ్చినా అత్యాచారాలు ఆగడం లేదు. తాజాగా కాకినాడలో ఘోర సంఘటన చోటు చేసుకుంది.  జరిగింది. 4 ఏళ్ల పసిపాపపై ఇద్దరు మైనర్ బాలురు అత్యాచారానికి పాల్పడ్డారు. బాలికకు రక్తస్రావం కావడంతో ఆస్పత్రికి తరలించి చికత్స అందిస్తున్నారు. రేచర్లపేట ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం గాలిపటాలు ఎగరేద్దామనే వంకతో ఇద్దరు మైనర్ బాలురు ఒక చిన్నారిని మేడపైకి తీసుకెళ్లారు. అనంతరం అభంశుభం తెలియని ఆ పాపపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. రేప్ చేసిన తర్వాత తిరిగి ఇంటి వద్ద వదలిపెట్టి వెళ్లిపోయారు. అయితే చిన్నారికి స్నానం చేయిస్తున్న సమయంలో గాయాలు కనిపించడంతో.. ఏమైందని తల్లి ఆరా తీసింది. దాంతో జరిగిన విషయాన్ని తల్లికి చెప్పింది బాలిక. ఘటనపై బాధితురాలి తల్లి కాకినాడ టూటౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. వీరిలో ఒకరి వయసు 14 ఏళ్లు కాగా మరొకరి వయసు 8 ఏళ్ళు. సెల్‌ఫోన్‌లో అశ్లీల వీడియోలు చూసి ఆ ప్రభావంతో చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డారని సమాచారం.