వైసీపీ వర్సెస్ జనసేన: సినిమా యాక్టర్‌ పిచ్చి కూతలతో రెచ్చగొడుతున్నారు..!

వైసీపీ వర్సెస్ జనసేన: సినిమా యాక్టర్‌ పిచ్చి కూతలతో రెచ్చగొడుతున్నారు..!

ఇప్పుడు ఏపీలో రాజకీయం హీటెక్కుతోంది.. ఓవైపు వైసీపీ వర్సెస్ టీడీపీగా.. మరోవైపు వైసీపీ వర్సెస్ జనసేనగా మారిపోయింది.. రాప్తాడు జనసేన నేత పవన్ ఇవాళ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలోనే పవన్.. ఈ వ్యాఖ్యలు చేశారు.. వైసీపీ నేతల వేధింపులు ఎక్కువయ్యాయి.. పవన్ కల్యాణ్ ఆదేశిస్తే వారి తలలు నరికి తీసుకొస్తానంటూ వ్యాఖ్యానించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే.. దీనిపై రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఘాటుగా స్పందించారు.

జనసేన నేతల వ్యాఖ్యలకు సోషల్ మీడియా వేదికగా కౌంటర్ ఇచ్చారు ప్రకాష్‌రెడ్డి.. "మా పెద్దాయన ఎప్పుడో చెప్పాడు, తొడలు కొట్టడం మాకు రాదు, మీసాలు తిప్పడం మాకు తెలీదు, మాకు తెలిసినది ఆకలి అన్న వాడికి అన్నం పెట్టడం , కష్టాల్లో ఉన్నవాడికి తోడుగా నిలవడం.. అలాగే దశాబ్దాలుగా ఫ్యాక్షన్ రాజకీయాలు ఉన్న రాయలసీమ ప్రాంతంలో , ఇప్పటివరకు ఒక్క చిన్న మారక కూడా లేకుండా నేను కానీ, నా కుటుంబం కానీ ఫ్యాక్షన్ రాజకీయాలకు దూరంగా ఉంటూ శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా బాధ్యతతో వ్యవహరిస్తూ వస్తున్నాం.. ఈరోజు ఎవరో సినిమా యాక్టర్, పెయిడ్ ఆర్టిస్టులతో వచ్చి పిచ్చి కూతలు కూసి ప్రజలను రెచ్చగొట్టి విధ్వసం సృష్టించాలని చూస్తున్నారు, దయచేసి ప్రజలు , అభిమానులు సంయమనం పాటించాల్సిందిగా కోరుకుంటున్నాను" అంటూ సోషల్ మీడియా వేదికగా స్పందించారు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి.