మరోసారి మెగాహీరోతో రొమాన్స్ చేయనున్న రాశికన్నా ?
రాశి ఖన్నా ఈ పేరు తెలియని వారుండరు అనడంలో సందేహం లేదు. దాదాపు ఆరేళ్లుగా తెలుగు సినీ పరిశ్రమ లో హీరోయిన్గా కొనసాగుతోంది. అగ్ర హీరోల సరసన నటించే అవకాశం రాకపోయిన ఒక స్థాయిలో తనదైన పాత్రలతో అందరిని ఆకట్టుకుంటోంది. ఊహలు గుసగుసలాడే అంటూ కుర్రకారుని ఊహల్లో తేల్చేసింది ఈ ఢిల్లీ బ్యూటీ. అయితే కొన్నేళ్లుగా టాలీవుడ్ నాటా ఈ అమ్మడుకి అనుకున్న స్థాయిలో అవకాశాలు లేవు. వరల్డ్ ఫేమస్ లవర్ తరువాత మరో సినిమాకు రాశీ సంతంకం చేయలేదు. కానీ టాలీవుడ్లో అవకాశాలు ఎంత తక్కువ ఉన్నా, తమిళంలో మాత్రం మంచి జోష్‌ను కొనసాగిస్తోంది. వరుస సినిమాలతో తమిళంలో చక్రం తిప్పుతోంది. అయితే.. తాజాగా ఈ భామకు మరో బంపర్ ఆఫర్ వచ్చిందట. మెగాహీరో సాయిధరమ్ తేజ్, దర్శకుడు సుకుమార్ కాంబోలో ఓ సినిమా నిర్మిస్తున్నారు. సుకుమార్ శిష్యుడు ఈ సినిమాకు దర్శకుడు. సరికొత్త జోనర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయితేజ్ సరసన రాశీఖన్నా హీరోయిన్గా ఎంపికైనట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కబోతుందట. కాగా.. మెగా హీరో సాయితేజ్, రాశీ ఖన్నా కాంబోలో సుప్రీం, ప్రతిరోజూ పండగే సినిమాలు సూపర్ హిట్లుగా నిలిచిన సంగతి తెలిసిందే.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)