అఫ్ఘాన్‌ స్పిన్నర్‌ రషీద్‌ఖాన్‌ రేర్‌ ఫీట్‌..!

అఫ్ఘాన్‌ స్పిన్నర్‌ రషీద్‌ఖాన్‌ రేర్‌ ఫీట్‌..!

అఫ్ఘానిస్థాన్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ మరో అరుదైన ఫీట్‌ సాధించాడు.  ఐర్లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసి.. ఈ ఘనత సాధించిన తొలి స్పిన్నర్‌గా రికార్డు నెలకొల్పాడు. గతంలో లంక పేసర్‌ లసిత్‌ మలింగ కూడా వరుసగా నాలుగు వికెట్లు కూల్చాడు. ఈ మ్యాచ్‌లో తొలుత అఫ్ఘానిస్థాన్ 7 వికెట్లకు 210 పరుగుల భారీ స్కోరు సాధించింది. మహ్మద్‌ నబి (81; 36 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సర్లు) చెరగేగాడు. 211 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌  ప్రారంభించిన ఐర్లాండ్‌.. రషీద్‌ ధాటికి 20 ఓవర్లలో 178/8 స్కోరు చేసి ఓడింది. రషీద్‌ 18వ ఓవర్లో వరుసగా డాక్రెల్‌, గెట్కాటె, సిమి సింగ్‌లను ఔట్‌ చేశాడు.