నన్ను ముంబై ఇండియన్స్ తీసుకుంటుంది అన్నారు : రషీద్ 

నన్ను ముంబై ఇండియన్స్ తీసుకుంటుంది అన్నారు : రషీద్ 

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఎంత ముఖ్యమైన బౌలర్ అనేది అందరికి తెలుసు. నిన్న ఐపీఎల్ 2020 లో ఢిల్లీ తో జరిగిన మ్యాచ్ లో తాను 4 ఓవర్లలో 3 వికెట్లు తీసి 7 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇది రషీద్ ఐపీఎల్ బెస్ట్. ఈ మ్యాచ్ అనంతరం సన్‌రైజర్స్ తమ ట్విట్టర్ లో రషీద్ ఇంటర్వ్యూ పోస్ట్ చేసింది. అందులో రషీద్ తన మొదటి ఐపీఎల్ వేలం గురించి  మాట్లాడుతూ... ''నేను 2017 ఐపీఎల్ వేలం సమయంలో జింబాబ్వే లో ఉన్నాను. అప్పుడు నా దగ్గర రెండు మొబైల్స్ ఉన్నాయి. ఒకదానిలో నేను ఐపీఎల్ వేలం లైవ్, మరొకదానిలో మా ఫ్యామిలితో వీడియో కాల్ మాట్లాడుతూ నా పేరు కోసం ఎదురుచూస్తున్నాను. అప్పుడు నా కంటే ముందు ఇమ్రాన్ తాహీర్ వేలంకి వచ్చాడు. ఆ తర్వాత నా పేరు వచ్చింది. అప్పుడు నేను టెన్షన్ పడుతుంటే... మా బ్రదర్ ''ఏం కాదు నిన్ను ముంబై ఇండియన్స్ తప్పకుండా తీసుకుంటుంది'' అని అన్నాడు. నా వేలం మొదలయ్యింది. ఐపీఎల్ లో కొనుగోలు అయితే చాలు అనుకున్నా నన్ను సన్‌రైజర్స్ హైదరాబాద్ 4 కోట్లకు కొనుగోలు చేసింది. అప్పుడు మా ఫ్యామిలితో ఏం మాట్లాడాలో నాకు అర్ధం కాలేదు. ఇక 2017 లో ఐపీఎల్ లో మొదటి మ్యాచ్ ఆడుతున్నప్పుడు చాలా సంతోషం అనిపించింది. గతేడాది టీవీలో చూసిన ఐపీఎల్ లో ఈ ఏడాది నేను ఆడుతున్నాను అని అనుకున్నాను'' అంటూ రషీద్ తెలిపాడు.