ట్వీట్‌ చూసి షాక్‌కు గురైన యువ క్రికెటర్

ట్వీట్‌ చూసి షాక్‌కు గురైన యువ క్రికెటర్

ఐపీఎల్‌తో అనూహ్యంగా తెరపైకి దూసుకొచ్చిన పేరు రషీద్ ఖాన్... ఇప్పటి వరకు ఎవరికీ పెద్దగా తెలియని రషీద్... ఒకే మ్యాచ్‌తో అందరి దృష్టి ఆకర్షించాడు. ముఖ్యంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌లో ఈ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ప్లేయర్‌ ప్రదర్శనకు అంతా ముగ్ధులయ్యారు. ఏకంగా క్రికెట్ దేవుడు సచిన్‌ తెండూల్కర్‌ కూడా ట్విటర్‌ స్పందిస్తూ ప్రశంసల వర్షం కురిపించాడు. టీ-20 ఫార్మాట్‌లో ప్రపంచంలోనే రషీద్‌ఖాన్‌ అత్యుత్తమ బౌలర్‌ అని కితాబిచ్చారు... ఐతే, సచిన్‌ పెట్టిన ట్వీట్‌ను ఎంతోమంది రీట్వీట్ చేసిన తర్వాత గానీ రషీద్‌ ఖాన్ చేసుకోలేదట... అయితే మ్యాచ్‌ అయిపోయాక టీమ్‌తో కలిసి హోటల్‌కు వెళ్తుంటే... నా స్నేహితుడు సచిన్‌ చేసిన ట్వీట్‌ను స్ర్కీన్‌ షాట్‌ తీసి పెట్టాడట... ఆ ట్వీట్‌ చూసిన తాను షాక్‌కు గురయ్యానని చెప్పాడు రషీద్‌ ఖాన్... ఏకంగా సచిన్ లాంటి వ్యక్తి స్పందించేసరికి మనోడికి ఏం చేయాలని తోచలేదట... వెంటనే రిప్లై ఇవ్వడానికి కూడా ఏం ఇవ్వలో తెలియక సుమారు రెండు గంటలు ఆలోచించానని... చివరకు ఎప్పటికో బదులిచ్చానని వెల్లడించారు రషీద్.