అరుదైన ఘనత సాధించిన రషీద్‌ ఖాన్‌...

అరుదైన ఘనత సాధించిన రషీద్‌ ఖాన్‌...

ఆఫ్గనిస్థాన్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ శతాబ్దంలో ఒకే టెస్ట్‌లో అత్యధిక ఓవర్లు వేసిన బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. జింబాబ్వేతో జరిగిన రెండో టెస్ట్‌లో రషీద్‌ ఏకంగా 99.2 ఓవర్లు వేసి చరిత్ర సృష్టించాడు. అయితే ఈ రికార్డు ఇంతకముందు ఆస్ట్రేలియా స్పిన్‌ మాంత్రికుడు షేన్‌ వార్న్‌ పేరిట ఉండేది. 2002లో కేప్‌టౌన్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో... షేన్‌ వార్న్‌ 98 ఓవర్లు వేశాడు. ఆ రికార్డును తాజాగా రషీద్‌ బ్రేక్‌ చేశాడు. అయితే మొత్తం క్రికెట్ చరిత్రలో ఓ టెస్ట్ మ్యాచ్ లో అధ్యాధికా ఓవర్లు వేసిన ఆటగాడు మాత్రం ముత్తయ్య మురళీధరన్‌. 1998  ఇంగ్లండ్‌ తో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో మురళీధరన్‌ 113.5 ఓవర్లు వేసాడు.