సరికొత్త రికార్డ్ తో రషీద్ ఖాన్

సరికొత్త రికార్డ్ తో రషీద్ ఖాన్

అనతి కాలంలోనే ప్రపంచ క్రికెట్ ప్రేమికులందరినీ తమవైపు తిప్పుకొన్న ఆఫ్ఘనిస్తాన్ యువ క్రికెటర్ రషీద్ ఖాన్ సంచలనాల దిశగా సాగుతున్నాడు. 19 ఏళ్ల వయసున్న లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్.. టీ-20 మ్యాచ్‌ల్లో తక్కువ సమయంలోనే 50 వికెట్లు తీసిన క్రికెటర్‌ గా ఘనత సాధించాడు. ఆదివారం బంగ్లాదేశ్‌‌తో జరిగిన టీ-20 మ్యాచ్‌లో రషీద్ ఖాన్ మూడు వికెట్లు తీసి.. ఇప్పటి వరకు పాకిస్తాన్ స్పిన్నర్ సయీద్ అజ్మల్ పేరుతో ఉన్న రికార్డ్ ను పటాపంచలు చేశాడు. తన పేరిట ఈ రికార్డ్ ను నమోదు చేసుకున్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 ఓవర్లకి13 పరుగులిచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. జింబాంబ్వేతో 2015 అక్టోబర్ 26న జరిగిన టీ-20 మ్యాచ్ తో ఎంట్రీ ఇచ్చిన రషీద్ ఖాన్.. ఇప్పటివరకు 31 టీ-20 మ్యాచ్‌లు ఆడి.. 50 వికెట్లు తీశాడు.