నేను పెళ్ళికి సిద్ధం అంటున్న 21 ఏళ్ల రషీద్...

నేను పెళ్ళికి సిద్ధం అంటున్న 21 ఏళ్ల రషీద్...

21 ఏళ్ల ఆఫ్ఘనిస్తాన్ యువ స్పిన్నర్ రషీద్ ఖాన్ పెళ్ళికి సిద్ధం అంటున్నాడు. ప్రస్తుతం టీ 20 లలో ఐసీసీ నెంబర్ వన్ బౌలర్ గా కొనసాగుతున్నాడు రషీద్. అయితే ఈ మధ్య ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ యువ బౌలర్ మాట్లాడుతూ...  నేను పెళ్లి చేసుకుంటాను, అయితే అది ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ గెలిచినప్పుడు మాత్రమే జరుగుతుంది అని ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు. రషీద్ ఖాన్ తమ జట్టు తరపున ఓ వన్డే  ప్రపంచ కప్‌, టీ 20 ప్రపంచ కప్‌ లో ఆడాడు. ఇక మొత్తంగా, ఆఫ్ఘనిస్తాన్ 2 వన్డే ప్రపంచ కప్ మరియు 4 టీ 20 ప్రపంచ కప్లలో పాల్గొంది, కానీ టోర్నమెంట్లో పెద్ద ప్రభావం చూపలేకపోయింది. అందువల్ల ఆఫ్ఘనిస్తాన్ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత నేను నిశ్చితార్థం చేసుకుంటాను మరియు వివాహం చేసుకుంటాను అని రషీద్ చెప్పుకొచ్చాడు. ఈ విషయాన్ని తాను వెల్లడించిన తర్వాత ప్రేక్షకులు  స్పందిస్తూ..  కొందరు అతన్ని బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌తో పోల్చగా, మరికొందరు "పెళ్లినుండి తప్పించుకోవడానికి మంచి ప్లాన్ " అని రాశారు.