పెద్ద గ్రౌండ్స్ కావాలంటున్న రషీద్ ఖాన్... ఎందుకంటే..?

పెద్ద  గ్రౌండ్స్ కావాలంటున్న రషీద్ ఖాన్... ఎందుకంటే..?

రషీద్ ఖాన్ మాట్లాడుతూ చిన్న గ్రౌండ్ లో తనలాంటి స్పిన్నర్లకు పరుగులు ఇవ్వకుండా ఉండటం కష్టతరం అవుతుంది అని తెలిపాడు.. ఆఫ్ఘనిస్తాన్ తరపున అని ఫార్మాట్లలో 245 వికెట్లు పడగొట్టిన రషీద్ ఖాన్, ఈ రోజుల్లో బ్యాట్స్మెన్ల బ్యాట్ సైజులు చాలా భారీగా ఉన్నాయని, తప్పుడు షాట్లు కొట్టిన కూడా బౌండరీలు వెళ్తాయని చెప్పాడు. బెంగళూరు మరియు మొహాలిలోని మైదానాలు చాలా చిన్నవి, ఇలా చాలా ఉన్నాయి అని తెలిపాడు. అందువల్ల పెద్ద గ్రౌండ్లు ఉండాలి అని రషీద్ అన్నారు .

రషీద్ ఖాన్ 2017 లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ పై ఐపీఎల్ లో అడుగుపెట్టాడు మరియు ఇప్పుడు అతను సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతున్న ప్రధాన ఆటగాళ్లలో ఒక్కడు. పలు సందర్భాల్లో తన జట్టు కోసం ఒంటిచేతితో మ్యాచ్‌లు గెలిచాడు. ఐపీఎల్‌లో ఆడటం తన కల అని రషీద్ ఒప్పుకున్నాడు, ఎందుకంటే అంతర్జాతీయ తారలందరూ నగదు అధికంగా ఉన్న లీగ్ పైకప్పు కింద గుమిగూడుతుండటం తనకు చాలా ఆనందంగా అనిపిస్తుంది అని తెలిపాడు. ఐపీఎల్ ప్రేక్షకుల అనుభవం కూడా భిన్నంగా ఉంటుంది ”అని రషీద్ ఖాన్ చెప్పారు.