అఫ్ఘానిస్థాన్‌ విజయానికి 118

అఫ్ఘానిస్థాన్‌ విజయానికి 118

ఐర్లాండ్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్‌లో అఫ్ఘానిస్థాన్‌ విజయం దిశగా సాగుతోంది. విజయానికి 118 పరుగుల దూరంలో ఉంది. స్పిన్‌ సంచలనం రషీద్‌ ఖాన్‌ (5/82) రెండో ఇన్నింగ్స్‌లోనూ రాణించడంతో ఐర్లాండ్‌ 288 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన ఆధిక్యంతో కలిపి ఆఫ్ఘానిస్థాన్‌కు లక్ష్యం 147 పరుగులు. ఈ స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆ జట్టు ఆట ముగిసే సరికి వికెట్‌ కోల్పోయి 29 పరుగులు చేసింది. ఇషానుల్హా (16), రహ్మత్‌షా (11) క్రీజులో ఉన్నారు.