అల్లు అర్జున్ సినిమాలో ఎన్టీఆర్ హీరోయిన్

అల్లు అర్జున్ సినిమాలో ఎన్టీఆర్ హీరోయిన్

అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.  ఈ సినిమా షూటింగ్ వేగంగా  జరుగుతున్నది.  ఇప్పటికే సినిమాపై బోలెడు అంచనాలు ఉన్నాయి.  వచ్చే ఏడాది సంక్రాంతిని దృష్టిలో పెట్టుకొని సినిమాను చిత్రీకరిస్తున్నారు.  

ఈ సినిమాతో పాటు బన్నీ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.  ఈ మూవీ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళబోతున్నది.  ఇందులో బన్నీకి జోడిగా జైలవకుశ సినిమాలో హీరోయిన్ గా చేసిన రాశిఖన్నాను తీసుకుంటున్నారని తెలుస్తోంది.  ప్రస్తుతం ఈ హీరోయిన్ వెంకిమామ సినిమాలో నాగచైతన్యకు జోడిగా నటిస్తున్నది.  ఈ మూవీ షూటింగ్ ప్రసుత్తం వైజాగ్ లో జరుగుతున్నది.