రష్మికతో పాటు.. రాశి ఖన్నా కూడా..!!

రష్మికతో పాటు.. రాశి ఖన్నా కూడా..!!

సౌత్ హీరోయిన్లలో అదృష్టం అంటే రష్మిక మందన్నదే అనుకోవచ్చు.  ఛలో సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. గీత గోవిందం సినిమాతో హిట్ కొట్టింది.  ప్రస్తుతం మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరూ చేస్తున్నది.  టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ సినిమాల్లోనూ అవకాశం దక్కించుకుంది.  

కోలీవుడ్ లో తలపతి విజయ్ హీరోగా లోగేష్ కనగరాజ్ ఓ సినిమా చేస్తున్నారు.  బిజిల్ తరువాత ఈ మూవీ ఉంటుంది.  ఇందులో మొదట హీరోయిన్ గా రష్మికను అనుకున్నారు.  అప్పటికే ఆమెను ఫిక్స్ చేశారు.  సర్ప్రైజ్ గా సినిమాలో మరో హీరోయిన్ కు ఛాన్స్ ఉండటంతో.. ఆ అవకాశం రాశిఖన్నాకు దక్కింది.  ఇది ఆమెకు అదృష్టం అనే చెప్పాలి.  కోలీవుడ్ లో స్టార్ హీరోతో సినిమా చేసే అవకాశం దక్కించుకుంది.  ఈ మూవీ ఆగుస్ట్ నుంచి సెట్స్ మీదకు వెళ్ళబోతున్నది.