పారితోషికం విషయంలో తగ్గేదే లేదంటున్న రష్మిక...

పారితోషికం విషయంలో తగ్గేదే లేదంటున్న రష్మిక...

కరోనా కారణంగా సినీ పరిశ్రమకు పెద్ద దెబ్బ తగిలిందనే చెప్పాలి. ఈ క్రమంలో కొంతమంది హీరోయిన్లు పారితోషికం తగ్గించుకోవడానికి రెడీ అయ్యారు. కానీ హాట్ హీరోయిన్స్  పూజా హెగ్డే ,రష్మికలు మాత్రం పారితోషికాన్ని అమాంతం పెంచేసి పెద్ద షాకిచ్చారు. ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మలు టాలీవుడ్లో సక్సెఫుల్ హీరోయిన్లుగా చలామణి అవుతున్నారు. అందువల్ల వీళ్ళకి బాగా డిమాండ్ పెరిగింది. పూజ హెగ్డే గ్లామర్ పాత్రలతో కుర్రకారుల మతులు పోగొడుతుంది. రష్మిక మందన్న కూడా ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరూ' సినిమాలో 'మైండ్ బ్లాక్' సాంగ్ లో హాట్ గా గ్లామర్ ఒలకబోస్తూ కిర్రాక్ స్టెప్పులేసి యూత్ మతులు పోగొట్టింది.

ఇక విషయానికి వస్తే ...పూజా హెగ్డే ను ఓ ప్రాజెక్టు కోసం దర్శక నిర్మాతలు సంప్రదిస్తే.. ఏకంగా రూ2.5 కోట్ల పారితోషికం చెప్పిందట. దాంతో వారు వెనకడుగు వేసినట్టు తెలుస్తుంది.ఇప్పుడు ర‌ష్మిక కూడా పూజ బాటలోనే నడుస్తున్నట్టు తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే.. శ‌ర్వానంద్ హీరోగా కిశోర్ తిరుమల డైరెక్షన్లో తెర‌కెక్కుతున్న `ఆడాళ్లూ మీకు జోహార్లూ` చిత్రం కోసం ర‌ష్మిక ఏకంగా 1.75 కోట్ల పారితోషికం అందుకుంటుందట‌. నిజానికి ఆమె 2కోట్లు డిమాండ్ చేసిందట.. తరువాత దర్శకనిర్మాతల భేరాల తరువాత రూ.1.75 కోట్లకు ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం రష్మిక అల్లు అర్జున్, సుకుమార్ కంబినేషన్లో వస్తున్న 'పుష్ప' మూవీ లో హీరోయిన్ గా నటిస్తుంది.