రష్మిక అవి బయటపెడతానంటోంది..!!

రష్మిక అవి బయటపెడతానంటోంది..!!

రష్మిక మందన్న.. టాలీవుడ్లో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్న హీరోయిన్లలో ఒకరు.  ఛలో సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక రెండో సినిమా గీత గోవిందంతో భారీ హిట్ కొట్టింది.  ఈ సినిమా హిట్ తరువాత డియర్ కామ్రేడ్  చేసింది.  ఈ మూవీ ఇటీవలే రిలీజ్ అయ్యింది.  ఇదిలా ఉంటె మహేష్ బాబు 26 వ సినిమా సరిలేరు నీకెవ్వరూ షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది.  

దీంతో పాటు రష్మిక భీష్మ సినిమా చేస్తున్నది.  ఈ సినిమా సెట్స్ లో కొన్ని సరదా సన్నివేశాలు జరిగాయి.  దర్శకుడు వెంకీ.. నితిన్ లో సెట్స్ లో సీరియస్ గా చర్చించుకుంటున్నారు.  వారికి కొద్దిదూరంలో రష్మిక కూర్చొని ఉన్నది.  చేతిలో సెల్ ఫోన్ పట్టుకొని కూర్చున్న ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యింది.  "నేను.. నితిన్ సీరియస్ డిస్కషన్ లో ఉన్నాం.. వెనక రష్మిక ఏం చేస్తున్నదో తెలియదు"అన్ని వెంకీ ట్వీట్ చేశాడు.  

దీనికి రష్మిక స్పందించింది.  "సెట్స్ మాకు తెలియకుండా మీరు ఏం చేస్తుంటారో బయటపెట్టమంటారా" అని సరదాగా రిప్లై ఇచ్చింది.  రష్మిక ట్వీట్ కు నితిన్ రిప్లై ఇచ్చాడు. " సెట్స్ లో మేము పని గురించే ఆలోచిస్తాం.. " అని ట్వీట్ చేశారు.  దీనికి రష్మిక కూడా ఫన్నీగా రిప్లై ఇచ్చింది.  ఈ ట్వీట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.