రెమ్యునరేషన్ పెంచితే తప్పేంటి : రష్మిక

రెమ్యునరేషన్ పెంచితే తప్పేంటి : రష్మిక

ప్రస్తుతం తెలుగు పరిశ్రమలో మంచి జోరు మీదున్న హీరోయిన్లలో రష్మిక మందన్న కూడా ఒకరు.  మొదటి రెండు సినిమాలు మంచి హిట్లుగా నిలవడంతో ఆమెకు ఆఫర్లు క్యూ కట్టాయి.  ప్రాజెక్ట్ ఆమె చేతిలో మహేష్ బాబు చిత్రం కూడా ఉంది.  ఇంత స్టార్ స్టేటస్ దక్కడంతో తెలుగు పరిశ్రమతో పాటు సొంత పరిశ్రమ కన్నడలో కూడా ఆమె రెమ్యునరేష్ హైక్ చేశారు. 

దీన్ని అక్కడి సినిమా వాళ్ళు కొందరు తప్పుబట్టారు కూడా.  తాజాగా ఇదే విషయం మీద మాట్లాడిన రష్మిక ప్రతి ఒక్కరు తమ కెరీర్లో సమయానుకూలంగా గ్రోత్ కోరుకుంటారు.  నేను కూడా అలాగే కోరుకున్నాను అంటూ రెమ్యునరేష్ పెంచడంలో తప్పేముంది అన్నట్టు డిఫెండ్ చేసుకున్నారు.