విజయ్‌ దేవరకొండ ఇంట్లో రష్మిక..!

విజయ్‌ దేవరకొండ ఇంట్లో రష్మిక..!

వెండితెరపై విజయ్‌దేవరకొండ, రష్మిక మందన్న జోడీ హిట్‌ పెయిర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. వీరిద్దరి జోడీ చూడముచ్చటగా, కన్నులపండువగా ఉంటుందని అభిమానులు సంబరపడిపోతుంటారు.   ఈ జంట కలిసి నటించిన ‘గీతగోవిందం’ ‘డియర్‌ కామ్రేడ్‌' చిత్రాలు ప్రేక్షకుల్ని అలరించాయి.  తెరవెనక కూడా విజయ్‌, రష్మిక మధ్య చక్కటి స్నేహ సంబంధాలున్నాయి. తాజాగా విజయ్‌దేవరకొండ అమ్మగారైన  మాధవి గురువారం హైదరాబాద్‌లోని స్వగృహంలో తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. ఈ వేడుకకు రష్మిక మందన్న హాజరైంది. విజయ్‌ కుటుంబసభ్యులతో ఆనందంగా గడిపింది. ఈ సెలబ్రేషన్‌ తాలుకూ ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.