రష్మిక స్టార్ తిరిగినట్టే !

రష్మిక స్టార్ తిరిగినట్టే !

సాధారణంగా హీరోయిన్లలకు స్టార్ హీరోలతో సినిమాలు చేసే ఛాన్సులు అంత త్వరగా రావు.  కనీసం పరిశ్రమలో మూడు నుండి నాలుగేళ్లు అయినా ఉండనిదే ఆ స్థాయిని అందుకోలేరు.  ఇప్పుడున్న స్టార్ హీరోయిన్లంతా అలా వచ్చినవారే.  కానీ రష్మిక మందన్న అలా కాదు.  2018లో తెలుగు పరిశ్రమలోకి వచ్చిన ఆమె ఏడాదిన్నర కూడా కాకూండానే మహేష్ బాబుతో సినిమా చేసే లక్కీ ఛాన్స్ కొట్టేసింది.  అనిల్ రావిపూడి డైరెక్షన్లో మహేష్ చేయనున్న 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో ఈమే కథానాయిక.  కొన్ని గంటల ముందే ఈ విషయం కన్ఫర్మ్ అయింది.  ఈ చిత్రం గనుక మంచి సక్సెస్ ఇస్తే స్టార్ హీరోయిన్ల జాబితాలో నిలబడిపోతుంది రష్మిక.