ఆమె స్టార్ హీరోయిన్ కావడానికి అదే కారణం

ఆమె స్టార్ హీరోయిన్ కావడానికి అదే కారణం

కన్నడ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ఛలో సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది.  ఈ సినిమా మంచి విజయం సాధించిన తరువాత గీత గోవిందంలో అఫర్ వచ్చింది.  మంచి కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా విజయంలో విజయ్ కు ఎంత పాత్ర ఉందొ... గీతగా చేసిన రష్మికకు అంతే మంచిపేరు వచ్చింది.  తన అభినయంతో ఆకట్టుకుంది.  

నిజం చెప్పాలంటే.. రష్మిక పెద్ద గ్లామర్ హీరోయిన్ కాదు.  తన అభినయంతోనే ఆకట్టుకుంటోంది.  అందమైన, నల్లని పెద్దవైన ఆమె కళ్ళు స్పెషల్ ఎట్రాక్షన్.  కళ్ళతోనే మాయ చేసింది.  ఆమె చిరునవ్వు ప్రతి ఒక్కరిని కట్టిపడేసింది.  స్టార్ హీరోయిన్ గా ఎదగడానికి అంతకంటే ఇంకేం కావాలి చెప్పండి.