తమిళంలోకి అడుగుపెడుతున్న రష్మిక !

తమిళంలోకి అడుగుపెడుతున్న రష్మిక !

 

కన్నడ నుండి తెలుగులోకి వచ్చి 'ఛలో, గీతగోవిందం' లాంటి హిట్ సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకుంది రష్మిక మందన్న.  తెలుగునాట ఆమెకు స్టార్ హీరోల సినిమాల్లో సైతం ఆఫర్లు వస్తున్నాయి.  దీంతో ఆమె తమిళ పరిశ్రమపై కూడా దృష్టి పెట్టింది.  కార్తీ హీరోగా మొదలవుతున్న కొత్త సినిమాలో ఆమె కథానాయకిగా నటిస్తోంది.  ఈరోజే సినిమా లాంచ్ అయింది.  ఈ చిత్రాన్ని 'రెమో' ఫేమ్ బక్కియరాజ్ కన్నన్ డైరెక్ట్ చేయనున్నాడు.