రష్మిక సౌత్ ను ఏలేస్తుందా..?

రష్మిక సౌత్ ను ఏలేస్తుందా..?

కన్నడ బ్యూటీ రష్మీక టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత ఆమె ఫేట్ మారిపోయింది.  ఛలో సినిమాతో రష్మిక ఎంట్రీ ఇచ్చింది.  ఇది మంచి హిట్ సాధించింది.  అనంతరం విజయ్ దేవరకొండతో గీత గోవిందం సినిమా చేసింది.  మీడియం రేంజ్ సినిమాగా వచ్చిన ఈ సినిమా వంద కోట్ల రూపాయలు వసూలు చేసింది.  ఈ సినిమా తరువాత చేసిన దేవదాస్ కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.  

ప్రస్తుతం విజయ్ దేవరకొండతో డియర్ కామ్రేడ్ చేస్తోంది.  మే 31 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  అలాగే మహేష్ 26 వ సినిమాలో కూడా రష్మిక నటిస్తోంది.  దీనితో పాటు కార్తీ హీరోగా చేస్తున్న ఓ తమిళం సినిమాలో కూడా చేస్తోంది.  ఇదిలా ఉంటె, విజయ్ 64 వ సినిమాలో కూడా రష్మికను హీరోయిన్ గా తీసుకోబోతున్నారని సమాచారం అందుతోంది.  ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో విజయ్ సినిమా చేస్తున్నాడు.  ఈ సినిమా తరువాత కొత్త దర్శకుడితో సినిమా ఉండబోతుందని తెలుస్తోంది.  ఇందులో రష్మిక అయితే బాగుంటుందని అనుకుంటున్నారని సమాచారం.  అయితే, రష్మికకు ఈ విషయం ఇంకా తెలియదట.  అది నిజమైతే బాగుందని అంటోంది రష్మిక.