తమిళంలోకి అడుగుపెడుతున్న రష్మిక..!!

తమిళంలోకి అడుగుపెడుతున్న రష్మిక..!!

ఛలో సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన రష్మిక.. గీత గోవిందంతో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.  దేవదాస్ లో పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఈ అమ్మడు మరోసారి విజయ్ దేవరకొండతో డియర్ కామ్రేడ్ సినిమాలో నటిస్తోంది.  అటు కన్నడంలోను వరస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నది.  కన్నడలో ఆమె నటించిన యాజమాన్య సినిమా రిలీజ్ కు రెడీ అవుతున్నది.  

కన్నడ, తెలుగు ఇండస్ట్రీలలో వరస సినిమాలతో బిజీ అవుతున్న రష్మిక... ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నది.  కార్తీ హీరోగా చేస్తున్న ఓ రొమాంటిక్ లవ్ స్టోరీ సినిమాలో హీరోయిన్ గా చేసేందుకు అవకాశం వచ్చినట్టు తెలుస్తోంది.  ఇప్పటికే స్క్రిప్ట్ విన్న రష్మిక ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోందట.  భాగ్యరాజ్ కన్నన్ దర్శకుడు.  ఎస్ఆర్ ప్రభు ఈ సినిమాను డ్రీమ్ వారియర్ బ్యానర్లో నిర్మిస్తున్నారు.  ఎప్పుడు ఈ సినిమా ప్రారంభమయ్యేది త్వరలోనే తెలుస్తుంది.