ఆధారాల కోసం నిలదీస్తున్న రష్మిక !

ఆధారాల కోసం నిలదీస్తున్న రష్మిక !

'ఛలో' సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమైన రష్మిక మందన్న 'గీత గోవిందం' సినిమాతో ప్రేక్షకుల మనసులు దోచుకుంది.  ఈ సినిమా విజయంతో ఆమెకు తెలుగులో ఆఫర్లు వెల్లువెత్తాయి.  ప్రెజెంట్ ఆమె చేతిలో రెండు మూడు మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి.  అయితే కన్నడ పరిశ్రమ నుండి వచ్చిన ఆమె అక్కడ సినిమాలకు ఒప్పుకోవడంలేదని, అందుకు కారణం తెలుగులో రెమ్యునరేషన్ భారీగా వస్తుండటమేనని వార్తలొచ్చాయి.  అందుకే ఆ పరిశ్రమ ఆమెపై కోపంగా ఉందని కూడా మీడియా కథనాలు వెలువరించింది. 

వీటిపై స్పందించిన రష్మిక ఎవరు చెప్పారు నా పరిశ్రమ నాపై కోపంగా ఉందని అన్నారు.  అంతేకాదు ఈ వార్తను నేను నమ్మను, నాకు ఆధారాలు కావలి, ఉంటే నాకు పంపండి.  నాకు ఆసక్తిగానే ఉంది తెలుసుకోవాలని.  ఇలాంటి వార్తల్లో అసలు సెన్స్ లేదు.  నాకు ఆధారాలు కావాలి అన్నారు.