జనసేనకు షాక్.. రావెల రాజీనామా..

జనసేనకు షాక్.. రావెల రాజీనామా..

సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరజయాన్ని చవిచేసిన పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీకి మరో షాక్ తగిలింది. జనసేన పార్టీకి మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు రాజీనామా చేశారు. చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన రావెల కిషోర్ బాబు.. కొన్ని పరిణామాలతో మంత్రిపదవి కోల్పోయారు. అనంతరం ఎన్నికలకు ముందు జనసేన పార్టీలోచేరిన రావెల.. సార్వత్రిక ఎన్నికల్లో గుంటూరు జిల్లా పత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. అయితే, ఈ ఎన్నికల్లో ఆయన ఓటమిపాలయ్యారు. అయితే, ఇవాళ జనసేన పార్టీకి రాజీనామా చేశారు రావెల.. తన రాజీనామా లేఖను జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు పంపారు. వ్యక్తిగత కారణాలతో జనసేన పార్టీకి రాజీనామా చేస్తున్నానని, తక్షణం తన రాజీనామా లేఖను ఆమోదించాలని లేఖలో కోరారు.