భారీ ఫైట్స్ చేయనున్న రవి తేజ

భారీ ఫైట్స్ చేయనున్న రవి తేజ

మాస్ మహా రవి తేజ తాజాగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నేల టికెట్ సినిమా చేస్తున్నాడు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా రేపట్నుంచే ఫైట్ మాస్టర్స్ రామ్ – లక్ష్మణ్ ల నేతృత్వంలో భారీ యాక్షన్ ఎపిసోడ్ తెరకెక్కనుంది. ఆల్రెడీ రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్ వేశారని తెలుస్తోంది. ఈ సినిమాలో రవితేజ సరసన మాళవిక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది.

గతేడాది రవి తేజ నటించిన రాజా ది గ్రేట్ సినిమా భారీ విజయం సాధించడంతో ఈ నేల టికెట్ పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇదే క్రమంలో ఈ సినిమా శాటిలైట్ హక్కులు దాదాపు 25కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఫిదా ఫేమ్ శక్తి కాంత్ సంగీతం అందిస్తుండగా, ఎడిటర్ గా ఛోటా కె ప్రసాద్ పనిచేస్తున్నాడు. షూటింగ్ కూడా దాదాపు డెబ్భై శాతం పూర్తయినట్లు సమాచారం. మరోవైపు రవి తేజ, శ్రీను వైట్లతో చేయనున్న సినిమాను ఇవాళే పూజ కార్యక్రమాలతో లాంచ్ చేసుకున్నాడు.