బాలయ్య విషయంలో క్లారిటీ వచ్చింది

బాలయ్య విషయంలో క్లారిటీ వచ్చింది

నందమూరి బాలకృష్ణ తన 105వ చిత్రానికి సిద్ధమయ్యారు.  ముందుగా ఈ చిత్రానికి దర్శకుడు  బోయపాటి శ్రీను అని, ఆ తర్వాత రవికుమార్ అని వార్తలొచ్చాయి.  పైగా ఇద్దరు దర్శకులు బాలయ్య బాబుతో టచ్లో ఉండటంతో అభిమానుల్లో కన్ఫ్యూజన్ నెలకొంది.  కానీ నిన్నటితో ఈ విషయమై క్లారిటీ వచ్చేసింది.  బాలకృష్ణ పుట్టినరోజు సందర్బంగా నిన్న రవికుమార్, నిర్మాత సి.కళ్యాణ్ బాలయ్యను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.  దీంతో బాలయ్యను డైరెక్ట్ చేయబోయేది రవికుమారేనని రూఢీ అయింది.  అలాగే ఈ సినిమాకు 'క్రాంతి' అనే టైటిల్ పరిశీలనలో ఉందట.  త్వరలో దీనికి సంబందించిన అధికారిక సమాచారం వెలువడనుంది.