బీర్‌ తాగుతూ బస్సు దిగిన రవిశాస్త్రి..!

బీర్‌ తాగుతూ బస్సు దిగిన రవిశాస్త్రి..!

నిత్యం వివాదాల్లో ఉండే టీమిండియా కోచ్‌, మాజీ క్రికెటర్‌ రవిశాస్త్రి మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. మెల్‌బోర్న్‌లో జరిగిన మూడో టెస్టులో ఘనవిజయం సాధించిన భారత జట్టు.. స్టేడియం నుంచి హోటల్‌కు బస్సులో వచ్చింది. ఈ బస్సుల్లోనే ఆటగాళ్లతోపాటు కోచ్‌ రవిశాస్త్రి కూడా వచ్చాడు. వీరందరికీ భారత జట్టుకు అధికారికంగా మద్దతు ఇచ్చే 'భారత్ ఆర్మీ' సభ్యులు హోటల్ వద్ద సాదర స్వాగతం పలికారు. బస్సు నుంచి ఒక్కొక్కరుగా కిందికి దిగారు. విజయానందంలో ఉన్న కెప్టెన్‌ కోహ్లీ.. 'భారత్‌ ఆర్మీ' టీమ్‌ను చూసి చిందేశాడు. ఈక్రమంలో కోచ్‌ రవిశాస్త్రి బీర్‌ తాగుతూ బస్సు దిగాడు. ఇందుకు సంబంధించి వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసి నెటిజన్లు విపరీతంగా ట్రోల్‌ చేస్తున్నారు.