నాకు అలాంటి వాళ్లంటే అసలు నచ్చదు 

నాకు అలాంటి వాళ్లంటే అసలు నచ్చదు 

మాస్ మహారాజ్ రవితేజ తాజాగా నటించిన చిత్రం "నేల టికెట్టు". కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఈ వారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సంధర్భంగా ఓ మీడియా ఇంటర్వ్యూలో రవి తేజ మాట్లాడుతూ సినిమా విశేషాలను పంచుకున్నారు. నా తరం వాళ్లందరికీ నేల టికెట్టు అనే బాగా తెలుసు. ఇంట్లో బాల్కనీ టికెట్టుకు డబ్బులిస్తే..నేల టికెట్ కొనుక్కుని నాలుగు సినిమాలు చూసేవాడ్ని. ఈ సినిమాకు నేల టికెట్టు అని టైటిల్ పెట్టినా అన్ని వర్గాల ప్రేక్షకులతో ఈలలు వేయించేలా ఉంటుంది. చుట్టూ జనం.. మధ్యలో మనం అనే క్యాప్షన్ గురించి మాట్లాడుతూ నాకు అందరిలో కలిసి ఉండటం ఇష్టం. సినిమాలో పాత్ర కూడ అలానే ఉంటుంది. 

ఇంకా ముసలితనం అంటే చేతకాని తనం కాదు.. నిలువెత్తు అనుభవం అనే డైలాగ్ గురించి చెప్తూ ఈ కథలో నాకు బాగా నచ్చిన ఎలిమెంట్ అది. ముసలి వాళ్లంటే అందరు చాలా చిన్నచూపు చూస్తుంటారు. అమ్మానాన్నలని చూసుకోకుండా కొంతమంది వదిలేస్తుంటారు. అలాంటి వాళ్లంటే నాకు చాలా కోపం. నాకు నచ్చరు. డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ ఈ సినిమా స్టోరీని మూడేళ్ళ క్రితమే చెప్పాడు. అప్పుడు నాకున్న కమిట్మెంట్స్ ఉన్నాయి. ఈలోపు నువ్వు వేరే సినిమాలు చేసుకో అని చెప్పానని రవి తేజ తెలిపారు. ఈ నేల టికెట్టు సినిమాలో మాళవిక శర్మ హీరోయిన్ గా నటించగా, శక్తి కాంత్ సంగీతం సమకూర్చారు. రామ్ తాళ్లూరి నిర్మించారు.