వచ్చే ఏడాది వరకు రవితేజ బిజీ బిజీ

వచ్చే ఏడాది వరకు రవితేజ బిజీ బిజీ
మాస్ మహారాజ్ రవితేజ ఏడాది కాలంగా ఫుల్ బిజీ షెడ్యూల్స్ గడుపుతున్నాడు. పోయిన సంవత్సరం రాజా ది గ్రేట్ సినిమాతో పవర్ ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. దీని తరువాత టచ్ చేసి చూడు సినిమాతో పలకరించినా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నేల టిక్కెట్టు సినిమాలో రవి తేజ నటిస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకోవడంతో మే 25న రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా సెట్స్ లో ఉండగానే శ్రీను వైట్ల ప్రాజెక్టుకు పచ్చ జెండా ఊపేశాడు. అమర్ అక్బర్ ఆంటోని పేరుతో రూపొందుతున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్ అమెరికాలో రీసెంట్ గానే మొదలైంది. ప్రస్తుతం రవి తేజ లేని సీన్స్ ను శ్రీను వైట్ల అండ్ కో తెరకెక్కిస్తున్నారు. సినిమా దాదాపుగా అక్కడే జరగనుండడంతో స్ట్రెయిట్ షెడ్యూల్లో ఫినిష్ చేయాలనీ ప్లాన్ చేశారు. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇది పూర్తయ్యాక సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తమిళ హిట్ సినిమా తేరి రీమేక్ ను చేయనున్నాడు. ప్రస్తుతం తెలుగు నేటివిటీకి సరిపోయేలా కథలో మార్పులు చేర్పులను చిత్రయూనిట్ చేస్తోంది. అంటే ఇంకో ఏడాది పాటు రవితేజ డైరీ బిజీ బిజీ అన్నమాట.