ఆలస్యంగా వస్తున్న "డిస్కో రాజా".. కారణం ఇదేనా..?

ఆలస్యంగా వస్తున్న "డిస్కో రాజా".. కారణం ఇదేనా..?

"డిస్కో రాజా"తో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైన మాస్ మహారాజా రవితేజ కాస్త వెనక్కి తగ్గాడు.. ముందుగా ప్రకటించినట్టుగా డిసెంబర్ 20వ తేదీన కాకుండా జనవరి 24వ తేదీన వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ప్రకటించారు మేకర్స్.. ఈ చిత్రంలో గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ పార్ట్ ఎక్కువగా ఉండటంతో.. క్వాలిటీలో ఏమాత్రం తేడా రాకుండా ఈ మూవీని వాయిదా వేసినట్టు తెలుస్తోంది. ఇక, నవంబర్ 18తో చివరి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసి గుమ్మెడికాయ కొట్టేయనున్నారు.. ఇక, రిలీజ్ డేట్‌ మార్పు న్యూస్‌తో పాటు డిసెంబర్ తొలి వారంలో డిస్కోరాజా టీజర్‌ను వదలనున్నట్టు చిత్ర యూనిట్ పేర్కొంది. 

ఇక, ఎస్‌ఆర్‌టీ ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై రామ్‌ తళ్లూరి ఈ సినిమాను నిర్మిస్తుండగా.. వీఐ ఆనంద్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది.. ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. హీరో రవితేజ సరసన హీరోయిన్లుగా ‌పాయ‌ల్ రాజ‌పుత్, నభా నటేష్ నటిస్తున్నారు. సునీల్, తాన్యా హోప్, బాబీ‌సింహా, వెన్నెల‌ కిషోర్, స‌త్య తదితరులు ముఖ్యమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇక రిలీజ్ డేట్ వాయిదా పడినా.. అటు రిపబ్లిక్ డే, రవితేజ పుట్టినరోజు కానుకగా జనవరి 24న విడుదల కానున్న ఈ మూవీతో మంచి హిట్ కొట్టబోతున్నామని చిత్ర యూనిట్స్ నమ్మకంతో ఉంది.