మొదటిసారి కొత్త ప్రయోగం చేస్తున్న రవితేజ !

మొదటిసారి కొత్త ప్రయోగం చేస్తున్న రవితేజ !

ఇన్నాళ్లు మాస్ మాసాల సినిమాలకు, కమర్షియల్ సబ్జెక్టులకు మాత్రమే పరిమితమైన మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం కొత్త జోనర్లు ట్రై చేస్తున్నారు.  శ్రీను వైట్లతో చేస్తున్న 'అమర్ అక్బర్ ఆంథోనీ' పూర్తైన తరవాత 'ఎక్కడికి పోతావు చిన్నవాడ' ఫేమ్ విఐ ఆనంద్ డైరెక్షన్లో సినిమా చేయనున్నాడు రవితేజ. 

ఈ చిత్రం పూర్తిస్థాయి సైంటిఫిక్ థ్రిల్లర్ లా ఉంటుందట.  ఈ జోనర్లో రవితేజ సినిమా చేయడం ఇదే తొలిసారి.  థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించనుండగా కార్తిక్ సినిమాటోగ్రఫీ చేయనున్నాడు.  ఈ చిత్రంలో రవితేజకు జోడీగా 'నన్ను దోచుకుందువటే' ఫేమ్ నాభ నటేష్ నటించనుంది.