మార్చి 5 నుంచి 'డిస్కోరాజా' మొదలు

మార్చి 5 నుంచి 'డిస్కోరాజా' మొదలు

మాస్ మహారాజ ర‌వితేజ హీరోగా వీఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో 'డిస్కోరాజా' అనే చిత్రం త్వరలో తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామ్‌ తాళ్లూరి నిర్మించ‌నున్నారు. నభా నటేశ్‌, పాయల్‌ రాజ్‌పుత్‌లు హీరోయిన్లుగా ఎంపిక కాగా.. మరో నాయిక కోసం యూనిట్ అన్వేషిస్తోంది. వెన్నెల కిషోర్, సునీల్‌ ప్రధాన పాత్రలో నటించనున్నారు. ఎస్‌.ఎస్‌. తమన్‌ సంగీతం అందిచనున్నారు. త‌మిళ స్టార్ బాబీ సింహా ప్ర‌తి నాయ‌కుడిగా చేసే అవకాశం ఉంది.

ర‌వితేజ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా చిత్ర టైటిల్ లోగోను విడుద‌ల చేశారు. లోగో పోస్ట‌ర్ అభిమానుల‌ని అమితంగా ఆక‌ట్టుకుంది. ఈ సినిమా గత డిసెంబ‌ర్ నెలలోనే సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉన్నా.. కొన్ని కారణాల వలన వాయిదా పడుతూ వచ్చింది. ఇటీవల ఈ సినిమా చిత్రీక‌ర‌ణకి మ‌రింత ఆలస్యం జరగనుందని ప్ర‌చారం జ‌రిగింది. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ఈ నెల 5 నుండి ప్రారంభం కానుందని తెలుస్తుంది. సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమా హైదరాబాద్‌ షెడ్యూల్ తో ప్రారంభం కానుందట.