టీజర్ తో పలకరించనున్న రవితేజ

టీజర్ తో పలకరించనున్న రవితేజ
మాస్ మహారాజ్ రవి తేజ నటించిన తాజా చిత్రం నేల టికెట్టు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఆఖరిదశల్లో ఉంది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ జోనర్ ఈ సినిమా తెరకెక్కింది. ఇదివరకే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ రావడంతో టీజర్ ను రిలీజ్ చేయాలనీ చిత్రబృందం భావిస్తోంది. ఇందులో భాగంగానే ఏప్రిల్ 22న ఉదయం 9 గంటలకు ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయనున్నామని అధికారంగా తెలిపింది. గతేడాది రాజా ది గ్రేట్ సినిమాతో మంచి కమ్ ఇచ్చిన రవి తేజ..ఈ నేల టికెట్టుతో మంచి కమర్షియల్ విజయం సాధిస్తాడని సన్నిహిత వర్గాల సమాచారం. టైటిల్ తోనే అందరి దృష్టిని అక్కర్శించడం, ఫస్ట్ లుక్ రవి తేజ ఎనర్జిటిక్ లుక్ లో దర్శనమివ్వనుండడంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. గతంలో కళ్యాణ్ కృష్ణ తీసిన సోగ్గాడే చిన్ని నాయన, రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం సాధించిన నేపథ్యంలో ఈ నేల టికెట్టుపై ట్రేడ్ వర్గాల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలో రవి తేజ సరసన మాళవిక శర్మ హీరోయిన్ గా నటించగా, శక్తికాంత్ సంగీతం సమకూర్చారు. ఈ సినిమాను ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి నిర్మించారు.