దసరాకు విడుదలకానున్న రవిబాబు సినిమా !

దసరాకు విడుదలకానున్న రవిబాబు సినిమా !

నటుడు, దర్శకుడు రవిబాబు చేస్తున్న తాజా చిత్రం 'అదుగో'.  పంది పిల్ల ప్రధానంగా సాగే ఈ సినిమాను భారీ విఎఫ్ఎక్స్ తో రూపొందిస్తున్నారు.  అందుకే సినిమా ఇన్నాళ్లు ఆలస్యమైంది.  ఎట్టకేలకు చివరి దశ పనుల్లో ఉన్న ఈ చిత్రాన్ని ఈ దసరా సెలవులకు విడుదలచేయనున్నారు. 

సురేష్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 'బంటీ' పేరుతో ఇతర భారతీయ భాషల్లోకి అనువదిస్తున్నారు కూడ.  ఈ సినిమాలో రవిబాబు కూడ ఒక కీలక పాత్రలో నటించడం విశేషం.  ఈ ప్రాజెక్ట్ పై రవిబాబు చాలా ఆశలే పెట్టుకున్నారు.