ఐపీఎల్ 2020 కి అశ్విన్ దూరం కానున్నాడా..?

ఐపీఎల్ 2020 కి అశ్విన్ దూరం కానున్నాడా..?

ఐపీఎల్ 2020 ఎన్నో కరోనా కష్టాల మధ్య మొదలయ్యింది. అయితే ఇప్పుడు ఐపీఎల్ ఫ్రాంచైస్ లకు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. దాదాపు 5 నెలలు క్రికెట్ దూరంగా ఉన్న ఆటగాళ్లు గాయాల బారిన పడుతున్నారు. గత ఏడాది కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరపున ఆడిన అశ్విన్ ఈ ఏడాది ఢిల్లీ క్యాపిటల్స్ కు ఆడుతున్నాడు. అయితే ఐపీఎల్ 2020 లో ఢిల్లీ మొదటి మ్యాచ్ పంజాబ్ కు వ్యతిరేకంగా ఆడింది. అందులో అశ్విన్ వేసిన మొదటి ఓవర్లో 2 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు సాధించాడు. అయితే ఈ ఓవర్ చివరి బంతికి మాక్స్వెల్ కొట్టిన బంతిని ఆపే ప్రయత్నం లో అశ్విన్ కింద పడ్డాడు. ఆ సమయంలో అతని బరువు మొత్తం తన ఎడమ చేతి పై పడటంతో అతని భుజానికి గాయం అయినట్లు తెలుస్తుంది. అదే నిజం అయితే అశ్విన్ ఈ ఏడాది ఐపీఎల్ కు పూర్తిగా దూరం అయినట్లే. ఇక ఈ జట్టులో భారత సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ కూడా గాయం కారణంగా పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో పాల్గొనలేదు. మరి ఈ ఇద్దరు భారత ఆటగాళ్లు మళ్ళీ ఐపీఎల్ లో ఆడుతారా... లేదా అనేది చూడాలి.