21 వ శతాబ్దపు అత్యుత్తమ క్రికెటర్ గా జడేజా...

21 వ శతాబ్దపు అత్యుత్తమ క్రికెటర్ గా జడేజా...

21 వ శతాబ్దపు అత్యుత్తమ క్రికెటర్ గా భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ను ప్రకటించింది విజ్డెన్ ఇండియా. గత రెండు సంవత్సరాలుగా క్రికెట్ లో బ్యాటింగ్, బౌలింగ్, ఫిల్డింగ్ అంటూ అన్ని రంగాలలో జడేజా అద్భుతంగా రాణిస్తున్నాడు. క్రిక్‌విజ్ టూల్ సహాయంతో జడేజా ప్రదర్శనను విశ్లేచించిన విజ్డెన్ ఇండియా... అతనికి 97.3 రేటింగ్ వచ్చినట్లు ప్రకటించింది. ఇందులో శ్రీలంక లెజెండ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జడేజా కంటే ముందున్నాడు.  2009 లో భారత జట్టులోకి అరంగేట్రం చేసిన జడేజా 2012 లో  టెస్ట్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటివరకు 49 టెస్టులు ఆడాడు. తన టెస్ట్ కెరియర్ లో 35.26 సగటుతో 1,869 పరుగులు చేసిన జడేజా 213 వికెట్లు తీసుకున్నాడు. టెస్టుల్లో ఒకసారి 10 వికెట్లు, తొమ్మిదిసార్లు 5 వికెట్ల హల్ లో చేరాడు. బ్యాటింగ్‌లో కూడా ఒక సెంచరీ, 14 హాఫ్ సెంచరీలు సాధించాడు జడేజా.