ఐపీఎల్ లో అద్భుతమైన రికార్డుకు చేరువలో జడేజా...

ఐపీఎల్ లో అద్భుతమైన రికార్డుకు చేరువలో జడేజా...

భారత ఆల్ ‌రౌండర్ రవీంద్ర జడేజా లాక్ డౌన్ కు ముందు వరకు మంచి ఫామ్ లో ఉన్నాడు. ప్రస్తుతం ఐసీసీ ఆల్ ‌రౌండర్ల జాబితాలో లో టెస్ట్, వన్డే ఫార్మాట్ లో టాప్ 10 లో నిలిచిన ఏకైక భారత ఆటగాడు జడేజానే. ఇక ఐపీఎల్ లో ఎప్పటినుండో చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న జడేజా అద్భుతమైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. ఐపీఎల్ లో ఇప్పటివరకు 170 మ్యాచ్ లు ఆడిన జడేజా 1,927 పరుగులతో పాటుగా 108 వికెట్లు సాధించాడు. అయితే రేపు ప్రారంభం కానున్న ఈ ఏడాది ఐపీఎల్ లో జడేజా మరో 73 పరుగులు చేస్తే 2000 పరుగులు చేసి 100 కు పైగా వికెట్లు తీసిన ఏకైక ఆల్ ‌రౌండర్ గా జడేజా రికార్డు సాధిస్తాడు. ఈ రికార్డు లో జడేజా తర్వాత షేన్ వాట్సన్ 3,575 పరుగులు, 92 వికెట్లతో ఉన్నాడు. కానీ అతను సిఎస్కే జట్టులోకి వెళ్లిన తర్వాత గత ఏడాది ఒక ఓవర్‌ కూడా బౌలింగ్ చేయలేదు. ఇక ఆ తర్వాతి స్థానంలో మరో చెన్నై ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో 1,483 పరుగులు, 147 వికెట్లతో ఉన్నాడు. అంటే ఐపీఎల్ టాప్ 3 ఆల్ రౌండర్లు అందరూ సిఎస్కే లోనే ఉన్నారన్నమాట. ఇక రేపు ప్రారంభం కానున్న ఐపీఎల్ 13వ సీజన్ లో మొదటి మ్యాచ్ ముంబై ఇండియన్స్ తో సిఎస్కే ఆడనుంది.