రవిప్రకాష్‌-శివాజీ ఒప్పందంలో కొత్త కోణం

రవిప్రకాష్‌-శివాజీ ఒప్పందంలో కొత్త కోణం

టీవీ9 షేర్ల బదలాయింపు వ్యవహారంలో కొత్త కోణం బయటపడుతోంది.  షేర్ల బదలాయింపులో సంస్థ మాజీ సీఈవో రవిప్రకాష్‌-సినీ నటుడు శివాజీ మధ్య జరిగింది నకిలీ ఒప్పందం అని గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి రవిప్రకాష్‌ ఈమెయిల్స్‌ను సైబర్‌ క్రైమ్‌ పోలీసులు చెక్‌ చేశారు. ఒక్కరోజులోనే పాత పేర్లతో షేర్లను రవిప్రకాష్‌ బదిలీ చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఎన్‌సీఎల్టీలో కేసు వేసేందుకే నకిలీ ఒప్పందం చేసుకున్నారని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఈమెయిల్స్‌ ఆధారంగానే రవిప్రకాష్‌, శివాజీలకు సీఆర్‌పీసీ నోటీసులను పోలీసులు జారీ చేశారు.