కనకదుర్గగా రవితేజ..!!

కనకదుర్గగా రవితేజ..!!

హిట్ రేస్ లో రవితేజ కాస్త వెనుకబడ్డారు.  గత కొంతకాలంగా ఆయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కాలేకపోయాయి.  ప్రస్తుతం విఐ ఆనంద్ దర్శకత్వంలో డిస్కోరాజా సినిమా చేస్తున్నారు.  ఈ సినిమా షూటింగ్ రీసెంట్ గా స్టార్ట్ అయింది.  ఎవరూ ఊహించని విధంగా సినిమా ఉండబోతుందని తెలుస్తోంది.  

ఈ సినిమాతో పాటు రవితేజ మరో సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నాడు.  కందిరీగ వంటి హిట్ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన సంతోష్ శ్రీవాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు.  తమిళంలో సూపర్ హిట్టైన తేరి సినిమాను టాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు.  ఈ రీమేక్ లో రవితేజ హీరో.  కాగా, ఈ రీమేక్ కు కనకదుర్గ అనే టైటిల్ ను నిర్ణయించారని తెలుస్తోంది.  ఏప్రిల్ 15 వ తేదీ నుంచి సెట్స్ మీదకు వెళ్ళబోతున్న ఈ సినిమా ఈ ఏడాదిలోనే రిలీజ్ కానుంది.