క్రాక్ గా మారుతున్న రవితేజ 

క్రాక్ గా మారుతున్న రవితేజ 

రవితేజ 66 వ సినిమా క్రాక్ ఈరోజు ప్రారంభం అవుతున్నది.  మలినేని గోపీచంద్ దర్శకత్వంలో రవితేజ చేస్తున్న మూడో సినిమా ఇది.  గతంలో ఈ ఇద్దరి కాంబినేసనలో డాన్ శీను, బలుపు సినిమా తెరకెక్కింది.  ఈ సినిమా మంచి విజయం సాధించింది.   కాగా, ఇప్పుడు వీరి కాంబినేషన్లో మూడో సినిమా తెరకెక్కుతోంది.  ఈ మూడో సినిమానే క్రాక్.  ఇందులో శృతి హాసన్ హీరోయిన్ గా చేస్తున్నది.  అయితే వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ కూడా రవితేజ సరసన ఆడిపాడనుంది. ఆమె పాత్ర కూడా కీలకంగా ఉంటుందట. ఇక ఈ చిత్రంలో ర‌వితేజ ప‌వ‌ర్‌ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌ గా నటించనున్నాడు. ఠాగూర్ మధు నిర్మించనున్న ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నారు.