శ్రీను వైట్ల ఎఫెక్ట్.. సినిమాను కోల్పోయిన రవితేజ !

శ్రీను వైట్ల ఎఫెక్ట్.. సినిమాను కోల్పోయిన రవితేజ !

వరుస పరాజయాల్లో ఉన్న దర్శకుడు శ్రీను వైట్లకు హీరో రవితేజ డేట్స్, నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ ను ఇచ్చి సినిమాను తీయమంటే ఆయన మాత్రం 'అమర్ అక్బర్ ఆంటోనీ' రూపంలో ఒక ఫ్లాప్ సినిమా తీశారు. 

ఈ సినిమా మొదటిరోజే బాక్సాఫీస్ వద్ద బోల్తాపడిపోయింది.  ఈ పరాజయంతో మైత్రీ మూవీ మేకర్స్ కూడ ప్రేక్షకుల నుండి విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది.  అంతేకాదు ఈ ఫ్లాప్ కారణంగా హీరో రవితేజ కూడ ఒక సినిమాను కోల్పోవాల్సిన వచ్చింది.  మైత్రీ మూవీస్ తమిళ చిత్రం 'తేరి' తెలుగు రీమేక్ రైట్స్ కొనుక్కుని రవితేజతో ఆ సినిమా చేయాలనుకుందట.  కానీ 'అమర్ అక్బర్ ఆంటోనీ' దెబ్బకు ఆ ఆలోచనలు కాస్త మానుకున్నారట నిర్మాతలు.