మాస్ మహారాజాకు ఆడియన్స్ ట్విస్ట్

మాస్ మహారాజాకు ఆడియన్స్ ట్విస్ట్

మాస్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న నటుడు రవితేజ.  రవితేజ సినిమాలు వెరైటీగా మాస్ ను ఆకట్టుకునే విధంగా ఉంటాయి అనడంలో సందేహం లేదు.  అందుకే ఈ నటుడితో సినిమా చేయడానికి ప్రతి దర్శకుడు ఆసక్తి చూపుతాడు.  అన్ని రకాల వేరియేషన్స్ ఈయన సినిమాల్లో కనిపిస్తుంటాయి.  ఇక ఈరోజు నేల టిక్కెట్టు సినిమా రిలీజ్ అయింది.  టైటిల్ చూడగానే పక్కా మాస్ సినిమా అనుకున్నా.. ఇందులో నవరసాలు అన్ని ఉన్నాయట. సెంటిమెంట్, యాక్షన్, డ్రామా అన్ని సమపాళ్లలో ఉన్నాయి.  

వైజాగ్ లో అల్లరి చిల్లరిగా తిరిగే రవితేజ వైజాగ్ నుంచి హైదరాబాద్ రాగానే చాలా మార్పులు వస్తాయి.  అతను ఊహించని విధంగా సమస్యలను ఎదుర్కొనవలసి వస్తుంది.  రాజకీయాల్లో తలపండిన జగపతిబాబు సీఎం కావాలని అనుకుంటాడు.  సిఎం కావాలని అనుకునే సమయంలో ఏం జరిగింది.  ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయనేది కథ.  కథ రొటీన్ గానే ఉన్నది.  నేల టిక్కెట్టు అనే సరికి ప్రేక్షకులు పక్కా మాస్ సినిమా అనుకోని థియేటర్ కు పరుగులు తీస్తారు.  థియేటర్ కు వెళ్లిన ప్రేక్షకులకు మాత్రం వారు ఆశించిన విధంగా సినిమా లేదనే సమాచారం వినిపిస్తోంది.  థియేటర్ కు వచ్చిన ప్రేక్షకులకు అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చి హిట్ కొట్టాలన్న రవితేజకు ఆడియన్స్ ట్విస్ట్ ఇస్తారో లేదో తెలియాలంటే మరికొద్ది సేపు ఆగాల్సిందే.