వరుణ్ తేజ్, వెంకీలతో రవితేజ కలుస్తాడా ?

వరుణ్ తేజ్, వెంకీలతో రవితేజ కలుస్తాడా ?

 

ఈ 2019 ఏడాది తెలుగు పరిశ్రమ అందుకున్న మొదటి హిట్ 'ఎఫ్ 2'.  అనిల్ రావిపూడి డైరెక్షన్లో వరుణ్ తేజ్, వెంకీలు కలిసి నటించిన ఈ చిత్రం ఇప్పటికే 64 కోట్ల షేర్ వసూలు చేసి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.  ఈ చిత్రంతో వెంకీ కమ్ బ్యాక్ ఇవ్వగా అనిల్ రావిపూడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.  ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందనే టాక్ వినిపిస్తోంది.  ఇందులో వరుణ్ తేజ్, వెంకీలతో పాటు మాస్ మహారాజ రవితేజ నటిస్తాడట.  అయితే ఇప్పటికే చర్చల దశలో ఉన్న ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందనే విషయం ఇంకా తెలియరాలేదు.