కొత్త సినిమాను మొదలుపెట్టనున్న రవితేజ !

కొత్త సినిమాను మొదలుపెట్టనున్న రవితేజ !

మాస్ మహారాజ రవితేజ స్పీడ్ పెంచాడు.  వరుసగా సినిమాలు చేస్తున్నాడు.  ఇప్పటికే విని ఆనంద్ డైరెక్షన్లో డిస్కో రాజా అనే సినిమా స్టార్ట్ చేసిన ఆయన త్వరలో కొత్త సినిమాను ఆరంభించబోతున్నారు.  అదే తమిళ సూపర్ హిట్ చిత్రం 'తేరి' యొక్క తెలుగు రీమేక్. 

ఈ సినిమాను 'కందిరీగ' ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ డైరెక్ట్ చేయనున్నాడు.  ఏప్రిల్ 15 నుండి రెగ్యులర్ షూట్ మొదలుకానుంది.  ఈలోపు రవితేజ 'డిస్కో రాజా' మేజర్ షూట్ పూర్తి చేస్తారట.  మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, క్యాథరిన్ థ్రెసా హీరోయిన్లుగా నటించనున్నారు.