సీనియర్ హీరో లక్ ఈరోజు బయటపడిపోతుంది !

సీనియర్ హీరో లక్ ఈరోజు బయటపడిపోతుంది !

'రాజా ది గ్రేట్' సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన మాస్ మహారాజ రవితేజ ఆ తరవాత 'నేల టికెట్, టచ్ చేసి చూడు' వంటి రెండు భారీ ఫ్లాపులని చవిచూడాల్సి వచ్చింది.  దీంతో ఈసారి హిట్ కొట్టి తీరాలనే లక్ష్యంతో ఆయన శ్రీనువైట్లతో చేతులు కలిపి 'అమర్ అక్బర్ ఆంథోనీ' సినిమా చేశాడు.

రవితేజ ఈ సినిమాపై చాలానే ఆశలు పెట్టుకున్నారు.  ఈ చిత్ర జయాపజయాలే తన భవిష్యత్తును డిసైడ్ చేస్తాయని కాబట్టి ఫలితం పాజిటివ్ గా ఉండాలని ఆశిస్తున్నారాయన.  ఇకపోతే ఈ చిత్రం ఈరోజే ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలవుతోంది.  మరి ప్రేక్షకులు ఈ సినిమాకు ఎలాంటి తీర్పునిస్తారో, రవితేజ లక్ ఎలా ఉందో ఇంకొద్దిసేపట్లో బయటపడిపోనుంది.